నీళ్లు తాగకపోతే ప్రమాదం

Tuesday, September 13, 2016

బరువు తగ్గాలన్నా,ఆరోగ్యంగా ఉండాలన్నా...అంతెందుకు మన శరీరంలోని అవయవాలన్నీ వాటి పని అవి చక్కగా చేసుకుంటూ పోవాలన్నా నీళ్లెక్కువ తాగితే చాలు అసలు నీళ్ళు తాగకపోతే ...వచ్చే సమస్యలు చాలానే ఉన్నాయి.
* బరువు పెరుగుతారు ...
శరీరంలోని నీటి బరువు అనేది ఉంటుంది.అయితే అది నీళ్లు తాగడం వల్ల కాదు ...తాగక పోవడం వల్ల పెరుగుతుంది .నీళ్లు తాగనందు వల్ల శరీరం తనకున్న ప్రతీ నీటి చుక్కనీ దాచుకోవడం మొదలుపెడుతుంది . వింటానికి కొత్తగా ఉన్నా "ఇది నిజం " అంటున్నారు వైద్యులు. ద జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండో క్రైనాలజీ అండ్ మెటబాలిజం ఈ విషయాన్ని ఓ నివేదికలో స్పష్టం చేసింది.
* శక్తి తగ్గిపోతుంది...
నీరసంగా ఉంటోందా? ఇలాంటప్పుడు కాఫీ,టీలకి బదులు కాసిన్ని మంచి నీళ్లు తాగండి అప్పుడే శరీరం తేమగా మారుతుంది. ఎందుకంటే శరీరం డీ హైడ్రేషన్ కి గురైనప్పుడు శక్తి తగ్గిపోతుంది. ఏకాగ్రత కూడా కుదరదు. మనం తీసుకునే నీళ్లల్లో ఎనాబై శాతం వరుకూ మెదడు సామర్ధ్యం, దాని పనితీరు ఆధారపడి ఉంటాయి. ఒత్తిడిగా ఉన్నప్పుడు తగినన్ని నీళ్లు తీసుకోగలిగితే మానసిక సామర్ధ్యం పెరుగుతుంది చెబుతోంది బ్రిటన్ కి చెందిన ఓ అధ్యయనం!
* ఆకలేస్తోంధా?...
శరీరానికి తగినన్ని నీళ్లు అందకపోతే డీ హైడ్రేషన్ భాదిస్తుంది. ఇలాంటప్పుడు ఆకలిగానూ అనిపిస్తుంది. ఆ సమయంలో ఓ గ్లాసు చల్లటి నీళ్లు తాగాలి. ఇరవై నిమిషాలు ఆగిన తర్వాత అప్పుడు అల్పాహారం తినమని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. నీళ్లు ఎక్కువగా తాగకపోతే తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదు. మలబద్దకం, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలూ ఇబ్బంది పెడతాయి.
* అసహంగా ఉంటే!...
మనసంతా ఆందోళనగా, విసుగ్గా ఉందా? బహుశా మీ శరీరానికి తగినన్ని నీళ్లు అందకపోవడమే కారణం కావచ్చు... అంటున్నాయి యూనివర్సిటీ ఆఫ్ కనెక్టికట్ చెందిన ఆద్యాయనాలు. కాబట్టి ఎప్పుడూ ఒక నీళ్లు సీసాని పక్కన ఉంచుకోవడం వల్ల ఇలాంటి ఎన్నో సమస్యలు పరిష్కారమవుతాయి.
.కూడలిBlogillu.లేఖిని (Lekhini): Type in Telugu మాలిక: Telugu Blogs.
 

Recent Posts

recent comments

Live Visitors

sakshyam Network Blog's

Followers

Google+ Followers